చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పలు ప్రాజెక్టులకు వదర పొటెత్తింది. సత్యవేడులోని అరణియార్ రిజర్వాయర్ నుంచి నీటికి అధికారులు విడుదల చేశారు. 3600 క్యూసెక్కుల నీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఎడతెరపి లేని వర్షాల కారణంగా అరణియార్ జలాశయానికి వరద నీరు పోటెత్తింది. దీంతో 4 గేట్లు ద్వారా 8 వేలు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులో నీటిమట్టం 29.8 అడుగులు ఉంది. ఇన్ ఫ్లో గంటగంటకు పెరుగుతోందని అధికారులు తెలిపారు.
మరోవైపు పిచ్చాటూరు – శ్రీకాళహస్తి రహదారిపై వరద నీరు ఉద్దృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. దీంతో నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.