అవినీతి, ఆరోపణలతో ఆర్ముడు రిజర్వుడు హెడ్ కానిస్టేబుల్ తిమప్పను కర్నూలు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ శనివారం రాత్రి
సస్పెన్షన్ చేశారు. క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించి, అవినీతి ఆరోపణలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. పోలీసు మొబైల్ పార్టీలో డ్యూటీ చేస్తూ ఇసుక అక్రమ రవాణాలో అవినీతి ఆరోపణలు, అక్రమార్జనకు పాల్పడడంపై ఆర్ముడు రిజర్వుడు హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్పను సస్పెన్షన్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
అవినీతి ఆరోపణలపై పూర్తి స్ధాయి విచారణకు ఆదేశించారు. ఎవరైనా, ఏ స్ధాయి అధికారి అయినా విధుల్లో అలసత్వం ప్రదర్శించినా, క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించి అవినీతి ఆరోపణలు, అక్రమార్జనకు పాల్పడితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ హెచ్చరించారు.
Breaking: ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్.. అవినీతి ఆరోపణలతో అన్న ఎస్పీ
Advertisement
తాజా వార్తలు
Advertisement