Monday, November 18, 2024

ఏలూరు, నెల్లూరులో రైతులకు ఆక్వాకల్చర్ శిక్షణ వర్క్‌షాప్‌లు

ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ ఇండియా ఫౌండేషన్ (FWI India) నెల్లూరు అండ్ ఏలూరు జిల్లాల్లో చేపల సంక్షేమంపై ఆక్వాకల్చర్ శిక్షణా వర్క్‌షాప్‌లను నిర్వహించింది. ఈ కార్యక్రమాలకు ఆంధ్రా ఫిషరీస్, భవి ఆక్వా అండ్ ఫిష్ ఎఫ్‌.పి.ఓ, గ్రామోదయ ట్రస్ట్, సి.ఆర్. రెడ్డి కాలేజీ మద్దతు ఇచ్చాయి. హాజరైన రైతులు మత్స్య నిపుణులు డా.జి.పి.సత్యనారాయణరావు, డా.పురుషోత్తం సాయి, బి.విష్ణుభట్, డా.రామ్మోహనరావు, భూపేష్ రెడ్డి సదస్సులకు హాజరయ్యారు. ఈ నిపుణులు రైతులకు చేప పిల్లల ఎంపిక, నీటి నాణ్యత, చెరువు రికార్డుల నిర్వహణ అండ్ ఫిషరీస్ అండ్ ఎఫ్‌పిఓల ప్రాముఖ్యతపై శిక్షణ ఇచ్చారు.

ఈసంద‌ర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్ పులుగుర్త మాట్లాడుతూ… ఈ శిక్షణా వర్క్‌షాప్‌లు చేపల సంక్షేమంతో బలమైన వ్యాపారాన్ని నిర్మించడంపై రైతులకు అవగాహన కల్పిస్తాయని తాము ఆశిస్తున్నామన్నారు. అంతేకాకుండా, ఆక్వాకల్చర్ రంగానికి చెందిన అధికారులు, నిపుణులతో జ్ఞానాన్ని పంచుకోవడానికి తాము వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నామన్నారు. ఈ రంగంలోని నిపుణుల నుంచి సమాచారం పొందాలని కోరుకునే రైతులకు ఈ తరహా వర్క్‌షాప్‌లు తప్పనిసరన్నారు. భావి ఆక్వా అండ్ ఫిష్ ఎఫ్‌పిఓ వంటి రైతు ఉత్పత్తి సంస్థలతో భాగస్వామ్యాన్ని నిర్మించడం ద్వారా ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ రంగంలో ట్రేస్‌బిలిటీని (traceability) సాధ్యం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement