అమరావతి, ఆంధ్రప్రభ: ప్రతి రెండు సంవత్సరాలకు జరిగే ఏపిటీఎఫ్ రాష్ట్ర నూతన జనరల్ కౌన్సిల్ సమావేశాలు మే 30, 31 తేదీల్లో తిరుపతిలోని డా. జగ్జీవన్‌రామ్ భవన్‌లో నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయ రాజు, కె.కులశేఖర రెడ్డి తెల్పారు. ఈ సమావేశాల్లో నూతన జాతీయ విద్యావిధానం వెలుగులో రాష్ట్ర విద్యాశాఖలో 3, 4, 5 తరగతుల తరలింపు, మాధ్యమం, సీబీఎస్‌ఈ సిలబస్, టీచర్లకు అనవసర యాప్స్ భారం, బదిలీలు, పదోన్నతులు, నియామకాలు, సీపీఎస్ రద్దు, అసంబద్ధ పీఆర్సీ ఉత్తర్వులు, సామాజిక అంశాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. మే 31 మధ్యాహ్నం 3 గం.లకు రాష్ట్ర ఎన్నికలు జరుగుతాయని, ఆ మేరకు 26 జిల్లాల నుంచి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాల్గొనాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండీ వర కుమార్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..