ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) అభిబస్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లో యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ (యూటీఎస్) ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టికెట్ బుకింగ్, రిజర్వేషన్, ట్రాకింగ్, ఇంట్రా సిటీ, ఇంటర్ సిటీ బస్సులకు సంబంధించిన ఫిర్యాదులు ఇలా అన్ని అంశాలు ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ఏపీ ఆర్టీసీకి సహాయపడుతుంది.కొత్త యూటీఎస్‌లో నగదు రహిత చెల్లింపులు, ముందస్తు ఆన్‌లైన్ టికెట్ బుకింంగ్, ఆన్‌లైన్ బస్‌పాస్‌లు, ఆన్‌లైన్ కొరియర్, పార్శిల్ బుకింగ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, లైబ్‌బస్‌ట్రాకింగ్, సెంట్రల్ కమాండ్ స్టేషన్ వంటి ఎన్నో ఉపయోగాలున్నాయి.
కాగా ఏపీ ఆర్టీసీ తమ ప్రయాణికులకు నగదు రహిత, సులభతరమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయాణికులు ఈ వ్యాలెట్స్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్సు, యూపీఐ, డైనమిక్ క్యూఆర్ కోడ్‌లు తదితర చెల్పింపు ఎంపికలను ఉపయోగించి చెల్లించవచ్చు. ఈ సందర్భంగా అభిబస్ సీఈవో సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ రవాణాసంస్థల్లో ఒకటైన ఏపీఎస్‌ఆర్‌టీసీతో భాగస్వామిగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. తమ సాంకేతిక ఆవిష్కరణలతో బస్సు రవాణాలో అంతరాలను నివారించడమే లక్ష్యమన్నారు. యూఎటీఎస్ తమ అత్యుత్తమ ఆవిష్కరణల్లో ఒకటిగా పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..