Wednesday, November 20, 2024

APSRTC – ఇక ఏపీలో విద్యుత్తు బస్సులు

( ఆంధ్రప్రభ స్మార్ట్, చిత్తూరు బ్యూరో) – రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో కోలాహల పండుగ వాతావరణం నెలకొందని రాష్ట్ర రవాణా యువజన క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చిత్తూరు ఆర్డీసీ బస్ డిపోలో 17 నూతన ఆర్డీసీ సర్వీసులను నేడు మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత అయిదు సంవత్సరాలలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వీర్యమైనదని చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 1400 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయన్నారు. సుమారు 400 బస్సులు రోడ్ల మీదకి వచ్చాయన్నారు.

ఏ ఉద్దేశ్యంతో ఏపీఎస్ఆర్టీసీ ని స్థాపించారో గత అయిదేళ్ల నిర్వీర్యమైన సంస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఇక. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ముఖ్యంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అతి త్వరలోనే మహిళలకు ఒక శుభవార్త చెబుతామని తెలిపారు. వచ్చే అయిదేళ్లల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను తీసుకు వస్తామన్నారు.

- Advertisement -

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు, పూతలపట్టు ఎం ఎల్ ఏ లు గురజాల జగన్ మోహన్, కె.మురళి మోహన్, నగర మేయర్ అముద, జేసి పి.శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఆర్ టి సి ఆర్ఎం జితేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement