కడప: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే ఉచిత ప్రయాణం అమలవుతున్నందున.. మరింత లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావు లేకుండా రాష్ట్రంలో ప్రవేశపెడతామన్నారు. గడిచిన ఐదేళ్లలో జగన్ ముఠా దోపిడీ చేసిన ప్రజాధనాన్ని వడ్డీతో సహా కక్కిస్తామన్నారు. అంతకు ముందు రవాణాశాఖ మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారి కడప విచ్చేసిన రాంప్రసాద్‌రెడ్డికి టిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement