Tuesday, November 26, 2024

కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా ఏపీ.. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంతో ఏపీ తొలి వర్చువల్‌ కాన్ఫరెన్స్‌..

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోందని పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. ఎలక్ట్రానిక్‌ వాహన రంగంలో రూ.32వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ముందుకు వెళుతున్నట్లు- మంత్రి స్పష్టం చేశారు. పర్యావరణానికి హానీ చేయని పరిశ్రమలకు ఏపీ ప్రాధాన్యతనిసున్నదని ఆయన స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్‌ వాహన తయారీ హబ్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంతో ఆంధ్రప్రదేశ్‌ తొలి వర్చువల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు- మంత్రి పేర్కొన్నారు. ”షేపింగ్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ మొబిలిటీ-” పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ఎకనమిక్‌ డెవలప్‌ మెంట్‌ బోర్డు నిర్వహించే ఈ వర్చువల్‌ సదస్సులో ప్రధానంగా ఎలక్ట్రిక్ర్‌ వాహనరంగం లో పెట్టు-బడులు, అవకాశాలపై చర్చించనున్నట్లు- మంత్రి తెలిపారు. 60 మందికి పైగా ఎలక్ట్రిక్‌ వాహన సీఈవోలు పాల్గొనే ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ అవకాశాలను మంత్రి వివరించనున్నారు. కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా ఆంధ్రప్రదేశ్‌ అడుగులు వేస్తున్నామన్నారు.

ఈ ఎలక్ట్రిక్‌ వాహనరంగానికి సంబంధించిన వాహనాల తయారీ, విడి భాగాల తయారీ, ఛార్జింగ్‌ కి సంబంధించిన సదుపాయాలు, ఇతరత్రా అంశాలపై కంపెనీల సీఈవోల ద్వారా అభిప్రాయలు సేకరించనున్నారు. ఎలక్ట్రానిక్‌ వాహన రంగంలో మౌలిక వసతులు, క్లస్టర్‌ డెవలప్‌ మెంట్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వంటి అంశాలపై ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది సీఈవోలతో వర్చువల్‌ సదస్సులో మాట్లాడనున్నారు. ఈ సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌, విద్యుత్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి క్రిష్ణబాబు, నీతి ఆయోగ్‌ సలహాదారు (మౌలిక వసతుల అనుసంధానం, రవాణా, ఎలక్ట్రిక్‌ మొబిలిటి) జె.సిన్హా, ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ వీసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన గుమ్మాల, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం, మూవింగ్‌ ఇండియా ప్రతినిధుల బృందం, ఎలక్ట్రానిక్‌ మాన్యుపాక్చరింగ్‌ కంపెనీల సీఈవోలు,తదితరులు పాల్గొననున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement