ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ప్రైమరీ కీ విడుదలైంది. 897 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 25న రాష్ట్రవ్యాప్తంగా 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. 4,04,037 (87.17%) మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఐదు నుంచి ఎనిమిది వారాల్లో స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్ష జూన్/జూలైలో నిర్వహించే అవకాశం ఉంది. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు ఉన్న ఎవరైనా ఫిబ్రవరి 27 నుండి 29 వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలని ఏపీపీఎస్సీ సూచించింది.పోస్టు/వాట్సప్/ఎస్‌ఎంఎస్/ఫోన్/వ్యక్తిగతంగా సమర్పించడం పరిగణించబడదని ఏపీపీఎస్సీ వివరించింది.