Thursday, November 14, 2024

APPSC గ్రూప్-2 పరీక్షలు వాయిదా

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి.. గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)..మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ గ్రూప్‌-2 అభ్యర్థుల నుంచి వస్తోన్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ.. గ్రూప్-2 మెయిన్స్ ను రీషెడ్యూల్ చేస్తూ ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేసింది..

పాత షెడ్యూల్‌ ప్రకారం 2025 జనవరి 5వ తేదీన గ్రూప్‌ -2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. 2025 ఫిబ్రవరి 23వ తేదీకి గ్రూప్ -2 మెయిన్స్‌ వాయిదా వేసినట్టు ప్రకటించింది ఏపీపీఎస్సీ.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను https://psc.ap.gov.in సందర్శించాలని పేర్కొంది ఏపీపీఎస్సీ..

- Advertisement -

గతేడాది డిసెంబర్ 7న 897 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్‌-2కు 4 లక్షల 83వేల 535 మంది అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకోగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 4 లక్షల 4 వేల 37 మంది హాజరయ్యారు. వారిలో 92 వేల 250 మంది మాత్రమే ప్రధాన పరీక్షకు అర్హత సాధించిన విషయం విదితమే.. ఇక, ఈ ఏడాది జులై 28న మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉండగా అభ్యర్థుల విజ్ఞప్తితో కూటమి సర్కారు జనవరి 5న గ్రూప్‌-2 మెయిన్స్‌ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, మరోసారి అభ్యర్థుల నుంచి విజ్ఞప్తు వస్తుండడంతో.. 2025 జనవరి 5వ తేదీన జరగాల్సిన గ్రూప్‌ -2 మెయిన్స్‌ పరీక్ష.. ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసినట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement