అమరావతిలో చేపట్టనున్న పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ ద్వారా 20 పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. కేంద్రం సహకారంతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణాలతో సీఆర్డీఏ ద్వారా చేపట్టనున్న 20 పనులకు 11,467 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఇక, రాజధాని ప్రాంతంలోని కొండవీటి వాగు, పాలవాగులను వెడల్పు చేసేందుకు కూడా నిధులు కేటాయించారు. శాఖమూరు, నీరుకొండ వద్ద రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.1.585 కోట్లు కేటాయించారు. హ్యాపీ నెస్ట్ అపార్ట్ మెంట్ల నిర్మాణం కోసం రూ.984 కోట్లు మంజూరు చేశారు. వరద నీటి కాలువలు, డ్రెయినేజి వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థలు, సీనరేజి, యుటిలిటీ డక్ట్స్, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కోసం నిధులు మంజూరు చేశారు.