Tuesday, November 26, 2024

జూనియర్ సివిల్ జడ్జీల నియామకాలు.. నెల్లూరు జిల్లాకు ఎవ‌రు వ‌చ్చారంటే..

నెల్లూరు (లీగల్, ప్రభ న్యూస్) ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన పలువురిని జిల్లాలోని వివిధ కోర్టులలో జూనియర్ సివిల్ జడ్జిలుగా నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు స్పెషల్ ఎక్సైజ్ మేజస్ట్రేట్ గా టీ. సుయోధనను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బి. అఖిలను నియమించారు. కోట కోర్టు జూనియర్ సివిల్ జడ్జిగా చివుకుల భరత్ ను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది. గూడూరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జి గా ఆర్ అశోక్ కుమార్ ను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వు చేసింది.

ఇక‌.. నెల్లూరు నాలుగవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పీ భాస్కర్ ను నియమించారు. నెల్లూరు ఐదవ అదనపు మెజిస్ట్రేట్ గా జీ. దేవికను నియమించారు. నాయుడు పేట కోర్టు జూనియర్ సివిల్ జడ్జిగా పి. సంయుక్తాను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు చేసింది. సూళ్లూరుపేట స్పెషల్ అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గా ఎస్. అనిల్ కుమార్ ను నియమించారు. కందుకూరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జిగా పెళ్లకూరు పూర్ణిమాదేవి ను నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సూళ్లూరుపేట జూనియర్ సివిల్ జడ్జిగా ఫాజునిస ను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement