Saturday, November 23, 2024

ఆలయాల్లో బ్రాహ్మణేతరుల నియామకం.. కొన్ని చోట్లనే అనువంశిక అర్చకత్వం

ప్రధాన దేవాలయాల్లో అర్చకులుగా బ్రాహ్మణేతరుల నియామకంపై చర్చ జరుగుతోందని మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అనువంశిక అర్చకత్వం కొన్ని ఆలయాల్లోనే ఉందని చెప్పారు. దళితవాడల్లో దళితులనే అర్చకులుగా నియమించటం ఎప్పటినుంచో ఉందని పేర్కొన్నారు. ధార్మిక పరిషత్, ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌పై త్వరలో నిర్ణయం ఉంటుందన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించి కోర్టుల్లో 5 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందుకు త్వరలో అదనపు న్యాయ సలహాదారును నియమించుకుంటామని మంత్రి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement