అమరావతి, ఆంధ్రప్రభ: సాంకేతిక శిక్షణ సంస్థ ద్వారా అర్హులైన అభ్యర్థులు ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించే శిక్షణ పథకాన్ని సద్వినియోగించుకోవాలని రాష్ట్ర ఉపాధి మరియు శిక్షణా సంస్థ సంచాలకులు బండి నవ్య సూచించారు. ఈ ఏడాది చివరి మాసంలో శిక్షణ అందించనున్న క్రాప్ట్స్ మెన్ ట్రైనింగ్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఈ కోర్సులకు గతంలో 2018 లో ప్రవేశం పొందిన ఏదైనా ట్రేడ్నకు సంబందించిన అభ్యర్థులు శిక్షణ కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.
అఖిల భారత వృత్తి విద్యా శిక్షణా సంస్థ తరపున చేతి వృత్తులలో మెళుకువలపై నైపుణ్య తరగతులు నిర్వహించేందుకు జాతీయ మండలి ఈ ఏడాది డిసెంబర్ మాసంలో వార్షిక వ్యవస్థ అనుసరించి అనుబంధ అభ్యర్థులు, ఏడాది ముగింపునకు మిగిలిన అభ్యర్థులకు చివరి అవకాశం కల్పించనునట్లు డైరెక్టర్ నవ్య వివరించారు. సంబంధిత రుసుము నవంబర్ 9వ తేదీ లోపుగా చెల్లించాల్సి ఉంటుందని అదే చివరి తేదీగా గుర్తించాలని డైరెక్టర్ సూచించారు. ఇతర వివరాల కోసం ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ ని సంప్రదించాలన్నారు.