అమరావతి, ఆంధ్రప్రభ: యుపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలు -2023 సంవత్సరానికి గాను అంబేద్కర్ స్టడీ సర్కిల్ విశాఖపట్నం బ్రాంచ్‌లో ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ కొరకు ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వర్గాల పట్టభద్రులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా సాంఘిక సంక్షేమశాఖ సంచాలకులు హర్షవర్ధన్ సూచించారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్ నిబంధనలకు లోబడి కమ్యూనిటీ వారీగా అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.6లక్షలకు మించరాదన్నారు. పూర్తి వివరాల కోసం ఏపీఎస్‌టీడీసీ డాట్ ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. వెబ్‌లింక్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును నమోదు చేసి నింపాల్సిందిగా సూచించారు. ఆగస్ట్ 10వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపాలన్నారు.