అమరావతి, ఆంధ్రప్రభ: వైద్యశాఖ పటిష్టతలో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టిసారించింది. వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ నేషన్ హెల్త్ మిషన్ డైరెక్టర్ జే. నివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ పోస్టుల్ని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈనెల 2వ తేదీ నుండి వెబ్సైట్లో దరఖాస్తు ప్రొఫార్మా అందుబాటులో వుంటుందనీ, ఈనెల 12వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తుల్ని అందజేయాలని తెలిపారు. ఖాళీల వివరాలు, అర్హతలు, పోస్టులకు కావాల్సిన అనుభవం, నియామక విధానం అదితర వివరాల్ని వెబ్సైట్ లో పొందుపర్చామని వివరించారు. వెబ్సైట్లో వున్న దరఖాస్తు ప్రొఫార్మా తప్ప మరే ఇతర ప్రొఫార్మా లో పంపించే దరఖాస్తుల్ని పరిగణనలోకి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు.