Friday, November 22, 2024

ఏపీపీఈసెట్‌-2022 ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత సాధించిన‌ 1356 మంది విద్యార్థులు

గుంటూరు, (ఏఎన్‌యూ క్యాంపస్‌) ప్రభ న్యూస్‌: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈనెల 17 నుంచి 20 వరకు నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంటెన్స్‌ టెస్ట్‌ (ఏపీపీఈసెట్‌ )-2022 ప్రవేశ పరీక్ష ఫలితాలను బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అదనపు ఉపకులపతి, పీసెట్‌ చైర్మన్‌ ఆచార్య పి రాజశేఖర్‌, ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య బి సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ లు విడుదల చేశారు. పరీక్షలకు1394 మంది హాజరు కాగా, 1356 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో పురుషులు 974 మంది కాగా, మహిళలు 382 మంది ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వ్యాయామ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి బీపీఈడీ, యూజిడిపిఈడి కోర్సుల్లో ప్రవేశానికి ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించామని పిసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ పి. జాన్సన్‌ తెలిపారు. పరీక్షా ఫలితాలను ఏపీపిఈ సెట్‌ అంతర్జాలం నుంచి తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో ఏఎన్యూ రెక్టార్‌ ఆచార్య పి. వర ప్రసాద మూర్తి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి . కరుణ, యోగా కోర్సుల సమన్వయకర్త డాక్టర్‌ డి. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement