Monday, November 25, 2024

Appeal – ఒక్క పాల ప్యాకెట్ ప్లీజ్ … విజ‌య‌వాడ బాధితుల విన్న‌పాలు

పాల కొరతతో అర లీటర్ ప్యాకెట్ రూ.80
అయినా ల‌భించ‌ని దుస్థితి…

ఆంధ్రప్ర‌భ స్మార్ట్, విజయవాడ ః భారీ వర్షానికి వరదలో మునిగిన విజయవాడలో పాల కొరత ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు అమాంతం పాల రేట్లు పెంచేశారు. అర లీటర్ పాల ప్యాకెట్ ధర రూ.70-80 వరకు విక్రయిస్తున్నారు. ఇళ్లలో పిల్లలు ఉన్నారని, కనీసం ఒక్క ప్యాకెట్ అయినా పాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కాగా, విజయ డెయిరీ, కృష్ణ మిల్క్ యూనియన్ సెంట్రల్ ఆఫీసులు నీట‌ మునిగాయి. దాదాపు లక్షల లీటర్ల పాలు, పెరుగు ప్యాకెట్లు చెడిపోయాయి. దాంతో పాల కొరత తీవ్రమైంది. దీంతో ఇతర జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి పాలను తెప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement