Thursday, November 21, 2024

ప్రమాదంలో డిస్కంల మనుగడ: ప్రభుత్వానికి ఏపీఈర్సీ లేఖ

ఏపీలో విద్యుత్ పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వ తీరుపై పీఏసీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిస్కంలకు, ఇంధన శాఖ సెక్రెటరీకి, ఏపీ ఈఆర్ సీ ఘాటు లేఖ రాసింది. ఏపీ డిస్కంలకు చెల్లించాల్సిన వేల కోట్ల సబ్సిడీ బకాయిల పెండింగ్ పై ఎలక్ట్రసిటీ  రెగ్యులేటరీ కమిషన్ లేఖ రాసింది. రూ.25,257 కోట్ల బకాయిలపై ఈఆర్సి రాసిన లేఖను పయ్యావుల కేశవ్ బయట పెట్టారు. ఈ నెల 9వ తేదీ ఏపీఈఆర్సీని కలిసి ఇంధన శాఖలో పరిస్థితిలు, నిర్ణయాలపై ఈఆర్సికి పిఎసి చైర్మన్ పయ్యావుల ఫిర్యాదు చేశారు. పయ్యావుల భేటీ అనంతరం ప్రభుత్వానికి ఏపీ ఈఆర్సీ లేఖ రాసింది.

లేఖలో ఏపీ ఈఆర్సి అంశాలు;-

ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన రూ.15474 కోట్ల సబ్సిడీ బకాయలు వెంటనే చెల్లించాలని పేర్కొంది. స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన రూ.9783 కోట్ల ను విడుదల చెయాలని తెలిపింది. బకాయిల చెల్లింపులపై 14 రోజుల గుడువుతో నోటీసులు ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుంచి 14 రోజుల్లో స్పందన రాకపోతే విద్యుత్ సరఫరా నిలిపివెయ్యాలని ఆదేశించింది. డిస్కంలు మనుగడే ప్రమాదంలో పడిందని ఏపీ ఈర్సీ లేఖలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: ports & shipping: ఏపీలో కొత్త ప్రాజెక్టులకు కేంద్ర సహకారం!

Advertisement

తాజా వార్తలు

Advertisement