Wednesday, December 18, 2024

APCRDA | అమ‌రావ‌తికి మ‌రో రూ.24,276 కోట్లు !

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. కాగా, ఈ స‌మావేశంలో అమరావతి నిర్మాణానికి కొత్త‌గా రూ.24,276.83 కోట్ల పనులకు సీఆర్డీఏ 43వ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

ఇప్పటి వరకు జరిగిన‌ మూడు సమావేశాల ద్వారా మొత్తం 45 వేల 249 కోట్ల పనులకు అధికార యంత్రాంగం అనుమతులు ఇచ్చిందని మంత్రి తెలిపారు.అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్ల పనులకు ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ భవనాన్ని 103 ఎకరాల్లో నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.

అసెంబ్లీ జరిగేది ఏడాదికి 40, 50 రోజులే అని, మిగతా రోజుల్లో ప్రజలు అసెంబ్లీ భవనం టవర్‌పైకి వెళ్లి సిటీ మొత్తం చూడవచ్చని అన్నారు. మూడు-నాలుగు రోజుల్లో టెండర్లు ప్రారంభం అవుతాయన్నారు.

కాగా, అసెంబ్లీ భవనానికి రూ.765 కోట్లు, హైకోర్టు భవనానికి రూ.1048 కోట్లు, 5 ఐకానిక్ టవర్లకు రూ.4665 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. నాలుగు జోన్ల‌లో రోడ్డు టెండర్లకు రూ.9, 699 కోట్లు వెచ్చించగా ట్రంక్ రోడ్లకు రూ.7,794 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వచ్చే మంత్రివర్గంలో వీటికి ఆమోదం తెలుపుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement