అమరావతి: వైసీపీకి మరో షాక్ తగిలింది.. ఇన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పగా నేడు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడారు.. గవర్నర్ కోటాలో ఎన్నికైన కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే కోటాలో ఎంపికైన బల్లి కళ్యాణ చక్రవర్తి లు నేడు తన ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.. అలాగే పార్టీకి సైతం గుడ్ చెప్పారు. ఈ మేరకు వారు నేడు అమరావతిలో ఒక ప్రకటన విడుదల చేశారు.. తమ ఎమ్మెల్సీ రాజీనామా లేఖలను మండలి చైర్మన్ పంపనున్నట్లు చెప్పారు.. పార్టీ రాజీనామా లేఖలను ఇప్పటికే ఆ పార్టీ అధినేత జగన్ కు పంపినట్లు చెప్పారు..
- Advertisement -