ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ – అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వాలంటీర్లను నమ్ముకుని క్యాడర్ ను విస్మరించినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి అటువంటి తప్పులకు, పొరపాట్లకు చోటు ఇవ్వకుండా ఇన్చార్జిలు కార్యకర్తల మాట మీదే పార్టీ ముందుకు వెళుతుందని పేర్కొన్నారు.
అతి త్వరలో జరిగే జమిలి ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న శ్రీ శేషసాయి కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ జిల్లా వైసిపి నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన అయోధ్య రామిరెడ్డి పార్టీ శ్రేణులకు క్యాడర్ కు సానుభూతిపరులకు దిశా నిర్దేశం చేశారు. ఐదు సంవత్సరాల పాటు కష్టపడి ప్రజలకు సేవలందించిన దురదృష్టవశాత్తు అధికారంలోకి రాలేకపోయం అని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నేతలను కార్యకర్తలను సమన్వయం చేసి పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్లాలని జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కి సూచించారు. ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా నడుచుకుందాం అని తెలిపారు. 2019 లొ కష్టపడి పనిచేసాం కానీ 2024 ఎన్నికల్లో లోటు జరిగిందని, మన మధ్య తారతమ్యాలు లేకుండా పార్టీ గురించి పని చేద్దాం అని తెలిపారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించారని కానీ, టిడిపి సోషల్ మీడియా అనుకూల చానల్స్ వాటిని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు.
ప్రస్తుత కూటమి పాలన అంతా డొల్లతనంగా మారింది అన్నారు. పాలన చేతకాక ఇప్పటి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందన్నారు. నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కట్టాలని, ఎటువంటి ఆపద వచ్చిన అండగా పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు.
ఈ సమావేశ లో మాజీ మంత్రి వర్యులు పేర్ని నాని,, వెళ్ళoపల్లి శ్రీనివాస్,,మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణు, ఎంఎల్సి తలశీల రఘురాం, ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్, స్వామి దాస్, తన్నీరు నాగేశ్వరరావు, నర్నల తిరుపతి రావు, కడియాల బుచ్చిబాబు,, డిప్యూటీ మేయర్లు, వైసిపి కార్పొరేటర్ల పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.