అమరావతి – వైసిపి నేతలు దేవినేని అవినాష్, జోగి రమేష్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్‌లపై వచ్చే నెల నాలుగో తేది వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.. కాగా టిడిపి కార్యాలయం దాడి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేత దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్.. వారి పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు దేవినేని అవినాష్, జోగి రమేష్ లకు రక్షణ కల్పించాలని సూచించింది.. మరోవైపు.. ఈ కేసు విచారణకు దేవినేని అవినాష్, జోగి రమేష్ సహకరించాలని పేర్కొంది..
ఇదే సమయంలో దేవినేని అవినాష్, జోగి రమేష్ తమ పాస్‌పోర్ట్‌ను హ్యాండోవర్ చేయాలని స్పష్టం చేసింది.. ఇక , వైసీపీ నేతల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు కపిల్ సిబాల్.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి , సిద్ధార్థ లూత్రా తమ వాదనలను సుప్రీంకోర్టులో వినిపించారు.. దేవినేని అవినాష్, జోగి రమేష్‌తో పాటు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్ లకు మధ్యంతర రక్షణ కల్పించాలని సూచించింది సుప్రీంకోర్టు.. కాగా ముందస్తు బెయిల్ పై విచారణ వచ్చే నెల నాలుగో తేదిన చేపడతామని సుప్రీం కోర్టు తెలిపింది..