Friday, November 15, 2024

AP – గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వరద ముప్పు – మంత్రి లోకేష్

( ఆంధ్రప్రభ స్మార్ట్, మంగళగిరి ) – గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వాష్ రూము ల్లో రహస్య కెమెరాలు ఉన్నాయంటూ చేసే దుష్ప్రచారాలను మానాలని ఇదంతా ఫేక్ జగన్ చేస్తున్న డ్రామాలని ఐటీ మానవ వనరులు, విద్యాశాఖ ల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ధ్వజమెత్తారు. భారీ వర్షాల కారణంగా మంగళగిరి ప్రాంతంలో నీట మునిగిన ప్రాంతాలను ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు రక్షణ కల్పించే చర్యలపై ఆయన చర్చించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ గుడ్లవల్లేరు ఘటనలో వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. అక్కడ రహస్య కెమెరాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని కేవలం లైట్ బల్బు మాత్రమే ఏర్పాటు చేశారని ఇందుకు బాధ్యులను కూడా అరెస్ట్ చేశామని అన్నారు. ఇది నలుగురు మధ్య జరిగిన వ్యవహారం అని తెలిపారు. జగన్ లా తాను తల్లి చెల్లిని బయట గంటలేదని పేర్కొన్నారు. ఆడపిల్లలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కూడా తనపై ఉందన్నారు. బయట పడిన 3000 వీడియోల్లో ఎక్కడా అభ్యంతరకరమైన వీడియోలు లేవని తెలిపారు.పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారందరినీ జైలుకు పంపుతానని ఈ సందర్భంగా లోకేష్ హెచ్చరించారు.

- Advertisement -

గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే వరద ముప్పు.

గత అయిదేళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో మంగళగిరిలో ఏనాడు మురుగుపూకడిగా తీయలేదని నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే 450 కిలోమీటర్ల మేర మురుగు పూడిక తీసినట్లు చెప్పారు. ఇందుకోసం 50 లక్షల రూపాయలు ఖర్చుపెట్టినట్లు పేర్కొన్నారు. కేవలం ఈ కారణంగానే మంగళగిరి కి అసలైన ప్రమాదం తప్పిందని అన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురిసిందని అన్నారు. భవిష్యత్తులో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మంగళగిరి నుంచి మురుగునీరు ఎటువైపు మళ్లీస్తే సమస్య తలెత్తకుండా ఉంటుందో దీనిపై ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. మంగళగిరి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ లో భాగంగా భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థను నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం డిజైన్లను రూపకల్పన చేస్తున్నామన్నారు. మంగళగిరిలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అక్రమ కట్టడాలకు తావు లేకుండా చేశానని అటువంటి వాటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు జరుగుతున్నాయని అన్నారు.ఎప్పటికప్పుడు మంగళగిరిలో పరిస్థితి పై సమీక్షిస్తున్నానని కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశానని ఈ సందర్భంగా లోకేష్ స్వష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement