మాచర్ల – వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ను పొడిగించాలని కోరుతూ పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ వెంటనే ఎస్పీ ఆఫీసుకు ఆయనను తరలించారు..
హైకోర్టు తీర్పు జైలే….
వైసీపీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేసింది. హైకోర్టులో 4 ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు పిన్నెల్లి. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం సహా పిన్నెల్లి పై మూడు కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటికి వరకు ఈ కేసుల్లో మధ్యంతర బెయిల్ పిన్నెల్లి బయట ఉన్నారు.
ఇటీవల మొత్తం నాలుగు కేసుల్లో మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తుది తీర్పు వెలువరించింది. ఆ నాలుగు పిటిషన్లను కొట్టేసింది. దీంతొ పిన్నెల్లి ని అరెస్ట్ చేశారు.