తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదానికి ఇప్పట్లో తెర పడే అవకాశాలు కనిపించడం లేదు. కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కృష్ణా జలాలను 50:50 నిష్పత్తితో పంచాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అభిప్రాయం తెలపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ కోరడంతో ఈ మేరకు ఏపీ లేఖ రాసింది.
70:30 నిష్పత్తితో కృష్ణా నీటి పంపకాలు జరగాలని ఏపీ కోరింది. రెండో ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు నీటి పంపకాలు జరపాలని పేర్కొంది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలు ప్రాజెక్టు వారీగా చేయలేదని ఏపీ తెలిపింది. శ్రీశైలం నుంచి చెన్నైకు, సాగర్ నుంచి హైదరాబాద్ కు మాత్రం తాగునీటి సరఫరాకు కొన్ని నిబంధనలు ఉన్నాయని పేర్కొంది. సాగర్ లో విద్యుత్ ఉత్పత్తి, ప్రకాశం బ్యారేజీకి నీటి సరఫరా విషయంలో కొన్ని నిర్ణయాలు జరిగాయని చెప్పింది.
ఈ వార్త కూడా చదవండిః ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సండ్ర