విశాఖ క్రైం : ప్రభ న్యూస్చిరుత పులి చర్మాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను డిఆర్ఐ అధికారులు ఆర్కే బీచ్ పాండురంగ పురం సమీపంలో ఓ హోటల్ లో అదుపులోకి తీసుకున్నారు!వారి నుంచి చిరుత పులి చర్మంతో పాటు అలాగే వారు ఉపయోగించిన కారు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.వన్యప్రాణి చట్టం ప్రకారం వారిపై నమోదు చేశారు.
చిరుతపులులను వేటాడి దాన్ని చర్మాన్ని విక్రయించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న ముఠాను విశాఖలో మంగళవారం అదుపులోకి తీసుకోవడం జరిగింది.వీరి కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టడంతో పక్కా పథకం ప్రకారం తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు.
ముందస్తుగా తమకు అందిన సమాచారం మేరకువిశాఖలోని ఓ హోటల్ సమీపంలో ముఠాలోని ముగ్గురు వ్యక్తులను అధికారులు గుర్తించారు. వీరిని విచారించగా వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం నిషేధించిన చిరుతపులి చర్మాన్ని వ్యక్తులు కలిగి ఉన్నారని వెల్లడైంది. తదుపరి విచారణ ముఠాకు సంబంధించిన మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.పూర్తి సమాచారం తెలుసుకునే అధికారులు చిరుతపులి చర్మాన్ని, ముఠా వాడిన వాహనాలను సీజ్ చేసారు..