Thursday, July 4, 2024

AP – మిస్సైయిన అమ్మాయిని 48 గంట‌ల‌లో ప‌ట్టుకున్నాం …. ప‌వ‌న్ క‌ల్యాణ్

కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ”ఇటీవల భీమవరంకి చెందిన తేజశ్విని కిడ్నాప్‌నకు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం. పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూకశ్మీర్‌లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు. 9 నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. . పోలీసులు 48 గంటలలో వాళ్ళను అద్భుతముగా పట్టుకున్నారు.. జమ్మూ కాశ్మీర్ లో ఆ అమ్మాయిని గుర్తించారు.. ఇటువంటి బాధలు ఐదేళ్లు పడ్డారు.. గతంలో ఇదే పోలీసు.. ఇదే ప్రభుత్వం.. గత ప్రభుత్వం లో 30 వేలు అమ్మాయిలు మిస్ అయ్యారు.. ఇంత మంది అమ్మాయిలు మిస్ అయితే మనం ఎందుకు ప్రత్యేక సెల్ పెట్టకూడదని క్యాబినెట్ లో ప్రస్తావిస్తామన్నారు. పోలీసులకి నిధులు కొరత ఉంది.. 9 నెల‌ల క్రితం మాయ‌మైన అమ్మాయి జాడ తెలుసుకున్న పోలీస్ వ్యవస్థకి ధన్వవాదాలు తెలిపారు అని డిప్యూటీ సీఎం. అయితే, ఒక అమ్మాయి మిస్ అయ్యి 24 గంటలు అయితే మరచిపో అంటారు.. నేను ప్రగల్బాలు పలకను.. ఫలితాలు చూపిస్తాను అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఇవన్నీ ఎందుకు చెబుతున్నాననంటే ప్రభుత్వం తలచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికే. గత అయిదేళ్లలో ఎంత మంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆడపిల్లల అదృశ్యంపైన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసేలా చూస్తా. పోలీసుల సంఖ్యాబలం పెరగాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

గత ప్రభుత్వం అడ్డగోలుగా నిధులు తీసుకుని పంచాయతీలకి ఇవ్వలేద‌ని.. నిధుల కొరత ఉంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో సిబ్బంది కొరత ఉంద‌న్నారు. కోరింగ ఫారెస్ట్ లో అరుదైన ఫిషింగ్ క్యాట్ గణన చేయాలి.. దేశంలో అన్ని రాష్ట్రాలకి ఏపీ తలమానికంగా ఉండాలి.. మడ అడవులను రక్షించుకోవాలి.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ముందు ఉండాలి.. పంచాయతీలకు ఇన్ని సంవత్సరాలు నిధులు రాలేదు అని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ ఐదేళ్ల లో ఏడాదికి రూ. 1000 కోట్లు పంచాయతీలకు రావాల్సి ఉంటుంది.. పిఠాపురంలో 40 పంచాయతీలలో నిధులు లేవు.. హాప్ ఐ ల్యాండ్ లో మడ అడవులను కాపాడుకుంటూ.. ఏకో టూరిజంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అని పవన్ తెలిపారు.

త్వరలో ఉప్పాడ తీరాన్ని పరిశీలిస్తా..

ఉప్పాడ తీరం కోతకు గురవుతున్న నేపథ్యంలో దాన్ని ఎలా రక్షించుకోవాలనే అంశంపై క్షేత్రస్థాయి పర్యటన చేస్తా. ఈ పర్యటన పూర్తయ్యేలా సహకరించాలని అక్కడి యువతను కోరుతున్నా. తీరం కోత గురించి నిపుణుల బృందం అధ్యయనం చేస్తుంది. ఎక్కువ మంది తెలుగు వాళ్లు విదేశాల్లో ప్రస్తుతం సీఈవోలుగా ఉన్నారు. మనదేశానికి, రాష్ట్రానికి సంబంధించిన యువత ప్రతిభను ఇక్కడే వినియోగించుకునేలా అవకాశాలు కల్పించాలి. శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలి” అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


ప్ర‌భుత్వమంటే అల్లా ఉద్దీన్ అద్భుత ద్వీపము కాదు.. గత ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కేశారు.. ఏ నిధులు దేనికి కేటాయించాలో వాటికి గత ప్రభుత్వం కేటాయించలేదు.. ఈ ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం.. అగ్రికల్చర్ టూరిజం మరింత ముందుకు వెళ్ళాలి.. పోలీసులు, హోం గార్డులు సమస్య నా దృష్టిలో ఉంది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement