Friday, November 22, 2024

AP – ప‌రిశ్ర‌మ‌ల‌లో సేఫ్టీ ఆడిట్ కు ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ – ప‌వ‌న్ కల్యాణ్

మంగళగిరి: ఫార్మా కంపెనీ బ్లాస్ట్ ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ . కాలుష్య నియంత్రణ తన శాఖ పరిధిలో ఉందని, భద్రత వేరే శాఖ కిందికి వస్తుందని చెప్పారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పామన్నారు. అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరమని అన్నారు. మంగళగిరిలోని నివాసంలో నేడు జ‌రిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్‌ చేయించాలని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్‌లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరమని చెప్పారు. సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదన్నారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు.

మ‌లి ద‌శ ఉద్య‌మానికి తొలి అడుగు

పంచాయతీ రాజ్‌ వ్యవస్థ బలోపేతంపై ఎన్డీయే కూటమి హామీ ఇచ్చిందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. 23న ఒకేరోజు 13,326 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మలిదశ సంస్కరణలు మొదలుపెట్టామన్నారు. పంచాయతీల్లో ఆగస్టు 15, జనవరి 26న ఉత్సవాల నిర్వహణకు నిధులు పెంచినట్లు వివరించారు. గ్రామసభల్లో యువత, మహిళలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా అమలు చేస్తామన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచేలా చర్యలు తీసుకున్నామని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement