Friday, November 15, 2024

AP – ఏసీబీ వలలో అంకిరెడ్డిపాలెం వీఆర్వో

గుంటూరు, ఆంధ్రప్రభ:పాసు పుస్తకాల కోసం లంచం డిమాండ్ చేసిన అంకిరెడ్డిపాలెం వీఆర్వో షేక్ హసీనా. అవినీతి నిరోధక శాఖ అధికారుల చేతికి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. . ఏసీబీ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం రాత్రి ఆమె కార్యాలయంలో దాడులు నిర్వహించారు.

వివరాల్లోకెళితే గుంటూరు మండలం వెంగళాయపాలెం 1,2 సచివాలయాల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న హసీనా చెరుకూరి ప్రమీల అనే మహిళ రైతు నుండి పాస్ పుస్తకాల కోసం రూ.2 లక్షల డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని భూ యజమానిరాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారు చెప్పిన విధంగా లంచంగా ఇవ్వదలచిన మొత్తాన్ని ముందుగానే ఏసీబీ అధికారులకు చూపించి వారు ఆ నోట్లకు కెమికల్ పూసి ఇవ్వమనడంతో హసీనాకు అందజేసింది.

డబ్బులు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెను విచారించిన మీదట అరెస్ట్ చేసి ఎసిబి కోర్టుకు తరలించారు.

- Advertisement -

గతంలో పనిచేసిన మంగళగిరి ప్రాంతంలో కూడా హసీనాపై ఫిర్యాదులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. గతంలో విఆర్ఓ హసీనాపై మంగళగిరి ప్రాంతంలో రూ.5 కోట్ల విలువైన భూ వివాదం ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యవహారంలో కూడా ఆమె పెద్ద మొత్తంలో తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

రాత్రి సమయంలో ఏ సి బి అధికారులు పంచాయతీ కార్యాలయానికి రావడంతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే విషయం తెలియడంతో అందరూ హసీనా గురించి చర్చించుకోవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement