వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హతతో ఉప ఎన్నిక
నేటి నుంచే ఎన్నికల కోడ్…
జిల్లాలో చంద్రబాబు నేటి పర్యటన రద్దు
నాలుగు తేది నుంచి నామినేషన్ లు స్వీకరణ
11వ తేది నామినేషన్ ల దాఖలకు ఆఖరు రోజు
12న నామినేషన్ ల పరిశీలన
28వ తేదిన పోలింగ్ .. ఆ మర్నాడు కౌంటింగ్
విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నగారా మోగింది. ఈ నెల 28న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ నెల 4న నోటిఫికేషన్ విడుదల చేసి, 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. షెడ్యూల్ విడుదల కావడంతో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై శాసన ఈ ఏడాది జూన్‌లో మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. రఘురాజు భార్య సుధ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరడం, టీడీపీ నేతతో కలిసి రఘురాజు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణాలతో ఆయనపై వేటు వేశారు.
శాసనమండలిలో వైసీపీ విప్ పాలవలస విక్రాంత్ ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో రఘురాజుకు మండలి ఛైర్మన్ ఆఫీసు నుంచి నోటీసు రాగా, ఆయన వివరణ కూడా పంపారు. అనంతరం వ్యక్తిగత విచారణకు హాజరు కావాలంటూ రఘురాజుకు నోటీసు ఇచ్చారు. అందుకు రఘురాజు రాలేదు. చివరకు ఆయనపై మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు అనర్హత వేటు వేశారు. ఇక ఈ ఎన్నికల కోడ్‌తో నేటి విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన రద్దయింది.
ఎన్నికల షెడ్యూల్..
ఈ నెల 4 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ,
12న పరిశీలన
ఈ నెల 14 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
ఈ నెల 28న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్
ఆమర్నాడు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని ప్రకటిస్తారు..