Thursday, September 5, 2024

AP – ఇక ఊరూర కలెక్టర్ – విజయనగరంలో వినూత్న కార్యక్రమం

తొలిరోజు ఓబులయ్యపాలెం సందర్శన
అంగన్వాడీలో పిల్లల పరిస్థితిపై ఆరా
ప్రాథమిక పాఠశాలలో తనిఖీ
విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై ప్రశ్నలు
ఊళ్లో పారిశుద్ధ్యం.. జర్వాలపై పరిశీలన
గ్రామస్థులతో కలెక్టర్ అంబేద్కర్ భేటీ

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయనగరం బ్యూరో) – గ్రామాల్లో విద్య, పారిశుద్ధ్య పరిస్థితిని విజయనగరం జిల్లా కలెక్టర్ స్వయంగా తెలుసుకున్నారు. పాఠశాలల నిర్వహణ, గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను సమీక్షించారు. గ్రామాల్లో ప్రభుత్వ సేవలను మెరుగు పరచడానికి చేపట్టిన గ్రామసందర్శన కార్యక్రమాన్ని విజయనగరంజిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రారంభించారు. జిల్లాలోని 27 మండలాల్లోని గ్రామాలు, ఏడు పట్టణాల్లోని వార్డుల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి గురువారం మండలంలో ఒ గ్రామాన్ని సందర్శించి అక్కడ ప్రభుత్వ సేవలను ఆరాతీసి, ఆ సేవలను మెరుగు పరిచే లక్ష్యంతో జిల్లా కలెక్టర్డ బి ఆర్ అంబేద్కర్ వినూత్నంగా గ్రామ సందర్శన కార్యక్రమం చేపట్టారు.

- Advertisement -

వేపాడ మండలం ఓబలయ్యపాలెం గ్రామాన్ని గురువారం ఉదయం సందర్శించారు. తొలుత గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడి పిల్లలఎదుగుదల, బరువుపై కలెక్టర్ ఆరా తీశారు. అలాగే ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. అక్కడ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం గమనించారు. ఈ స్కూలుకు పిల్లలు ఎందుకు రావటం లేదని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. స్టూడెంట్కిట్ల పంపిణీపై ఆరా తీశారు. శనివారంలోగా కిట్ లోని వస్తువులన్నీ విద్యార్థులకు అందజేయాలని ఆదేశించారు. అదే విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఆ తరువాత గ్రామంలోని వీధుల్లో పర్యటించారు. పారిశుద్ధ్య పరిస్థితులు గుర్తించారు. మలేరియా కేసులు, జ్వరాల పరిస్థితిని తెలుసుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడి ఊరి సమస్యలు తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement