Thursday, November 21, 2024

AP – పాడేరు లోయలో పడిన వ్యాన్ – ముగ్గురు దుర్మరణం

విశాఖపట్నం.. ఆంధ్రప్రభ బ్యూరో అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధి పాడేరు దరి ఘాట్ రోడ్ లో హెయిర్ పిన్ బెండు 12 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెదబయలు మండలంలో మంగళవారం రాత్రి మోదకొండమ్మ అమ్మవారు జాతర ఈవెంట్ చేసుకొని తిరిగి హెవీ లోడ్ తో వస్తున్న పెద్ద వ్యాను అదుపుతప్పి లోయలో పడింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. దీంట్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఇప్పుడు స్థానికులు సమాచారం. అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన ఎస్ ఎస్ వి ఈవెంట్స్, సౌండ్స్ అండ్ లైటింగ్ వారి ఆధ్వర్యంలో పెదబయలు మండలంలో మోద కొండమ్మ అమ్మవారి మహోత్సవాలు జరిగాయి.

మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరగగా బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ ఈవెంట్ స్టేజ్ , సౌండ్ , లైటింగ్ మొత్తం విప్పుకొని ఈవెంట్ నిర్వాహకుడు తన సిబ్బందితో వ్యాన్ లో ఈ సరుకును తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో హరి(19), లక్ష్మణ్(21), అశోక్ కుమార్(21) లు అక్కడికక్కడే మృతి చెందారు. అదే వ్యాన్ లో ప్రయాణిస్తున్న మరో ఎనిమిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. దీంట్లో రవి , ఏసు, పవన్, గణేష్, మోహన్, నితిన్, రోహిత్ లు ఉన్నారు . వీరికి చేతులు, కాళ్లు , నడుము తదితర భాగాలు విరిగిపోయినట్లు తెలుస్తోంది. వీరందరినీ అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన కేజీహెచ్ కు తరలించారు. మృతులు ముగ్గురికి పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

- Advertisement -

ఈ మృతులు, క్షతగాత్రులు అందరూ అచ్యుతాపురం పరిసర ప్రాంతాలకు చెందిన వారిని పోలీసులు తెలిపారు. వ్యాను బ్రేకులు ఫెయిల్ అవడం కారణంగా జరిగినట్లుగా భావిస్తున్న ఈ సంఘటనపై పాడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement