Wednesday, November 20, 2024

AP – ఈ అర్ధరాత్రి విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం

అమరావతి – : భారీ వర్షాలపై అధికారులతో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

బంగాళాఖాతంలోని వాయుగుండం అర్ధరాత్రి విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హోంమంత్రి వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 45-55కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. రేపు చాలాచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు

రానున్న రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని.. ఇకపై ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు హోంమంత్రి అనిత సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరతగతిన రెస్క్యూ ఆపరేషన్స్ జరగాలన్నారు.

- Advertisement -

ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇరిగేషన్ , ఆర్ డబ్ల్యూ ఎస్, హెల్త్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని హోంమంత్రి సూచించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్ , పడిన చెట్లు వెంటనే తొలగించాలన్నారు. ప్రజలు రోడ్ల మీద నీరు పూర్తిస్థాయిలో తగ్గేవరకు బయటకు రాకూడదని.. ప్రజలు సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని హోంమంత్రి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement