Sunday, June 30, 2024

AP – మ‌హిళ‌ల‌పై నేరాలు…ప్ర‌త్యేక దృష్టిపెడ‌తామ‌న్న హోం మంత్రి

మహిళలపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎపి డిజిపి, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో ఆమె పేషీలో నేడు స‌మావేశం నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, ఇందులో గత ఐదేళ్ళు పోలీసు వ్యవస్ధ నిర్లక్ష్యం చేయబడింద‌ని అన్నారు., పోలీస్ డిపార్టుమెంటుకు ఏం కావాలని అనే అంశాలు పట్టించుకోలేదని., పోలీసు అకాడమీ, గ్రేహౌండ్ అకాడమీ లేదంటూ గుర్తు చేశారు..

ఇక ఇప్ప‌టికీ విశాఖలో ఆరిలోవ పోలీసు స్టేషన్ రేకుల షెడ్డులో, చెట్ల కింద ఉందని ఆమె పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పుడు పొలీసు రిక్రూట్మెంట్ చాలా అవసరం ఉంద‌ని అంటూ . వ్రాత పరీక్షతో మహిళా సంరక్షణ కార్యదర్శులు అంటూ పోలీసులను చేసేసారని గ‌త ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. పోలీసులు అంటే ప్రత్యేక రిక్రూట్మెంట్ విధానం ఉందని అనిత చెప్పారు.

- Advertisement -

సీఐడీ నిన్నటి వరకూ ఎలా పని చేసిందో అందరికీ తెలుసునని., పీపుల్ పార్టనర్ షిప్ తో పోలీసు డిపార్ట్మెంట్ లో మార్పులు తెచ్చే దిశగా చర్చించాం అని చెప్పారు. పోలీసు అంటే ఎవరూ భయపడకూడద‌ని,.. ఏ కష్టమైనా చెప్పుకోవచ్చనే ధీమా రావాల‌ని అన్నారు… పోలీసులకు, పబ్లిక్ కి మధ్యలో సరైన సంబంధాలు ఉండాల‌ని చెప్పారు.. 16 నుండి 21 సంవత్సరాల వయసు మధ్య మహిళలు మిస్సింగ్ లో అవుతున్నార‌ని, దీనిపై దృష్టిపెట్టాల్సి ఉంద‌ని హోం మంత్రి పోలీస్ అధికారుల‌కు సూచించారు.. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి తో కూడా చర్చిస్తామని ఆవిడా పేర్కొన్నారు. అక్రమ కేసుల విషయంలో కూడా కమిటీ వేసి పూర్తి విచారణ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ప్రక్షాళన మొదలైంద‌న్నారు. దిశ పోలీసు స్టేషన్లు కూడా పేరు మార్చి ఎలా చేయాలన్నది ఆలోచిస్తున్నామ‌న్నారు. . మహిళా రక్షణ, గంజా విషయంలో ఒక టోల్ ఫ్రీ నంబరు ఇస్తామ‌న్నారు. . రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదని తేల్చి చెప్పారు.. పోలీసులకు రాజకీయాలకు దూరంగా ఉంటూ . మీ డ్యూటీ చేయంలంటూ హిత‌బోద చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement