Monday, November 18, 2024

AP – వాడవాడలా వాల్మీకి జయంతి ఉత్సవాలు

శ్రీ సత్య సాయి బ్యూరో, అక్టోబర్ 28 (ప్రభన్యూస్)
ఆశ్వీయుజ పౌర్ణమి, వాల్మీకి జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా వ్యాప్తంగా వాడ వాడలా వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. పలు ప్రాంతాలలో వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాల్మీకి విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కదిరి, హిందూపురం, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల కేంద్రాలలోనే కాకుండా ఆయా మండల కేంద్రంలో కూడా వాల్మీకి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.

ముఖ్యంగా కదిరి పట్టణ పరిధిలోని కుటాగుళ్ల గ్రామంలో గల వాల్మీకి విగ్రహానికి కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, వాల్మీకి కృష్ణమూర్తి అదేవిధంగా బోయ హక్కుల పోరాట కమిటీ నాయకులు వై ప్రసాదు, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కే శంకర ఏ గంగరాజు, గెంగెన్న అదేవిధంగా వైసీపీకి చెందిన రేకే రామచంద్ర, నరసింహులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం తరఫున వాల్మీకి మహర్షి చిత్రపటాన్ని ఊరేగించారు. ఈ సందర్భంగా యువతి యువకులు ప్రత్యేక భజనలు కోలాటాలు చేస్తూ పలువురిని ఆకట్టుకున్నారు.అదేవిధంగా హిందూపురం పట్టణంలో తెలుగుదేశం నాయకులు అంబికా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పలువురు బోయలు వాల్మీకి జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి జిల్లా కేంద్రంలో వాల్మీకి జయంతి సందర్భంగా సాయి ఆరారం లో గంగాధర్ , పీసీ గంగన్న తదితరుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి, వాల్మీకి జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఇంకా పెనుకొండ, కొత్తచెరువు, గోరంట్ల, ఓబుల దేవర చెరువు, బుక్కపట్నం తదితర ప్రాంతాలలో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement