అమరావతి – 2014లో విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను తీసుకోవాలని ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన నాలుగు పేజీల లేఖను రాశారు బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి రాబట్టుకోవడానికి శ్రద్ధ తీసుకోవాలని అభ్యర్ధించారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు..
పార్లమెంట్‌లో రాజ్యసభ విభజన జరిగిన తీరును లేఖలో ప్రస్తావించిన ఆయనే.. ఈ విషయంపై నేను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పదేళ్లుగా నడుస్తూనే ఉంది.. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదన్నారు.. గతంలో ఇలాంటి విషయాలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానని, . రాష్ట్రం తరఫున సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించారు.. కానీ, కారణాలేమైనా అవి అమలు కాలేదని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు..
అయితే, ఈ విషయంపై శ్రద్ధ తీసుకుని.. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరూ తర్వాత మనకు జరిగిన అన్యాయం విషయమై చర్చకు నోటీసులు ఇప్పించాలని కోరారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్‌లో పడిపోయిన రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలని అన్నారు ఉండవల్లి .