మంగళగిరి – అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత…వైసీపీ కి ఏపీలో పార్టీకి భవిష్యత్ లేదనే నిర్ణయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారట. చాలా మంది ముఖ్యనేతలు వైసీపీని వీడగా.. మరికొందరు అదే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. . డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సమక్షంలో ఇరువురు నేతలు జనసేన కండువా కప్పుకున్నారు.
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కండువా కప్పి పవన్ కల్యాణ్ ఇరువురు నేతకు ఆహ్వానం పలికారు.
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా జయమంగళ వెంకటరమణ ఉన్నారు . ఆయన కైకలూరుకు చెందిన నేత.
మరో నేత మంగళగిరికి చెందిన గంజి చిరంజీవి ఆప్కో చైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ పదవికి జయ మంగళ వెంకటరమణ రాజీనామా చేసి మండలి చైర్మన్‌కు రాజీనామా లేఖ పంపించారు.