Wednesday, December 18, 2024

AP – నర్సరీ నీటి కుంటలో పడి ఇద్దరు మృతి

ఒకరు అయిదో తరగతి చిన్నారి
మరొకరు స్కూల్ బస్ క్లీనర్

ఆంధ్రప్రభ స్మార్ట్, పల్నాడు బ్యూరో – అది శ్రీ చైతన్య స్కూల్ బస్సు.. ఎన్నాళ్ళ నుంచి రిపేర్ చేయించలేదో ఏమో.. ఇంజన్ వేడెక్కి బస్సు ఆగిపోయింది.. రేడియేటర్ ను చల్లార్చేందుకు నీళ్లు కావాలి.. ఈ అవసరమే ఒక అనర్ధాన్ని తెచ్చిపెట్టింది.. ఇద్దరు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు నుంచి శ్రీ చైతన్య స్కూల్ బస్సు యథావిధిగాని సోమవారం ఉదయం దాచేపల్లి కి బయలుదేరింది.

ఎప్పటిలానే పులిపాడు కు చెందిన ఐదో తరగతి విద్యార్థి సుభాష్ (11)ను ఆ తల్లి బస్సు ఎక్కించి భద్రం నాయనా అని చెప్పింది. సరే అమ్మ అంటూ వెళ్లిన ఆ బిడ్డ ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లే మృత్యువు నీటి కుంట లోకంలో పొంచి ఉందని తెలియదు. దాచేపల్లి కి వెళ్తున్న స్కూల్ బస్సు ఇంజన్ కు సమస్య వచ్చింది. తీవ్రంగా వేడెక్కి పొగలు రావడంతో బస్సును నిలిపి వేయక తప్పింది కాదు. దీంతో క్లీనర్ కోటేశ్వరరావు రహదారి పక్కనే నర్సరీ లోకి ఒక డబ్బాను తీసుకొని దారి తీసాడు. అతనితోపాటు సుభాష్ కూడా వెళ్లాడు. నర్సరీ అవసరాల కోసం తీసిన నీటిగుంటలోకి క్లీనర్ దిగి డబ్బాను నింపి ఒడ్డునే ఉన్న పిల్లాడికి అందించాడు. పట్టా తడిగా ఉండటంవల్ల ఆ చిన్నారి షూ జారి నీటి కుంటలో పడిపోయాడు. పడటం పడటం క్లీనర్ కోటేశ్వరరావు మీద పడిపోవడంతో ఇద్దరూ అదుపుతప్పి నీల లోతుకు వెళ్లారు.

- Advertisement -

పిల్లాడికి, క్లీనర్ కోటేశ్వరరావు కి ఈత రాదు. కంగారుగా ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఊపిరాడక ఇద్దరూ ఆ నీటి కుంటలోనే ప్రాణాలు వదిలారు. ఇద్దరి ప్రాణాలను బలిగొనడానికి కారణమైన బస్సును నిందించాలో.. బస్సు సమస్యను గుర్తించకుండా వాడుతున్న స్కూలు యాజమాన్యాన్ని నిందించాలో అర్థం కాక జనం తలపట్టుకున్నారు బడికెళ్ళొస్తానమ్మా అని బయలు దేరిన బిడ్డ నీటి కుంటలో పడి నిర్జీవిగా మారడం చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement