Friday, November 22, 2024

AP – ప్ర‌కాశం బ్యారేజ్ కి బోట్లు ఢీ – ఇద్ద‌రు అరెస్ట్..

మ‌రికొంద‌ర్ని అరెస్ట్ చేసే అవ‌కాశం..
కేసును వేగ‌వంతం చేసిన అధికారులు
కావాల‌నే బ్యారేజ్ ను ఢీ కొట్టించారు
మూడు బోట్లు ప్లాస్టిక్ రోప్ తో క‌ట్టారు
గొల్ల‌పూడి నుంచి న‌దిలోంచి వ‌దిలారు
ముఖ్య‌మంత్రికి నివేదిక స‌మ‌ర్పించిన అధికారులు

విజ‌య‌వాడ – ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన కేసులో పోలీసులు దూకుడు పెంచారు. బోట్ల యజమానులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బ్యారేజీని ఢీకట్టడంలో కుట్ర ఉందనే కోణంలో రామ్మోహన్, ఉషాద్రిని ప్రశ్నిస్తున్నారు. కాగా, విజయవాడను వరదల అతలాకుతలం చేశాయి.. ఓవైపు బుడమేరు.. మరోవైపు కృష్ణానదిలో వరద ప్రవాహం పెరగడంతో.. విజయవాడలోని చాలా కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి.. అయితే, ఇదే సమయంలో.. కృష్ణా నదిలో బోట్లు వచ్చి.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం సంచలనంగా మారింది.. ఈ బోట్లు సృష్టించిన విధ్వంసంతో .. ప్రకాశం బ్యారేజీకి చెందిన 67, 69, 70 గేట్లు దెబ్బతిన్నాయి.. దీని కోసం ఆ గేట్లను కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.. ఇంకో వైపు ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీ-కొన్న ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక చేరింది.. బ్యారేజీకి బోట్లు ఢీకొన్న సంఘటనలో కుట్ర కోణం ఉందని నివేదికలో వెల్లడించారు అధికారులు..

- Advertisement -

ఇప్పటి వరకు ఈ బోట్లు తమవేనని ఎవ్వరూ రాకపోవడమే కుట్ర కోణం ఉందనడానికి నిదర్శనమన్న నివేదికలో పేర్కొన్నారు అధికారులు.. బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు. కార్యకర్తలవని నివేదికలో నిర్ధారించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అనుచరుల బోట్లుగా గుర్తించినట్టు నివేదికలో వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్ ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకునేవారని నివేదికలో పేర్కొన్నారు.. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించినట్టు తెలిపారు.. AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023, AP-IV-M-SB-0017 నెంబర్లున్న బోట్లతో పాటు.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి మరో రెండు బోట్లు. ఉషాద్రి, కర్రి నరసింహా స్వామి, గూడూరు నాగమల్లేశ్వరీల బోట్లుగా గుర్తించారు. ఉషాద్రికి చెందిన మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందన్న నివేదికలో వెల్లడించారు.

ఇక, సహజంగా మూడు బోట్లను కలిపి కట్టరని నివేదికలో స్పష్టం చేశారు అధికారులు.. ఇనుప చైన్లతో కాకుండా.. ప్లాస్టిక్ రోప్స్‌తో బోట్లను కట్టేసినట్టు గుర్తించారు.. తాము హెచ్చరిస్తున్నా ఇనుప చైన్లతో బోట్లను కట్టలేదని స్థానికులు చెప్పారని నివేదికలో వెల్లడించారు.. తమ బోట్లతో పాటు.. సమీపంలోన మరో రెండు బోట్లు కూడా కొట్టుకెళ్లేలా ప్లాన్ చేశారని నివేదికలో చెప్పుకొచ్చారు అధికారులు. దీనిపై మ‌రింత లోతుగా విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పేర్కొన్నారు పోలీస్ అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement