అమరావతి – ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాజాగా మరో ఇద్దరు న్యాయమూర్తులను నియమించారు. అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ , డాక్టర్ యడవల్లి లక్ష్మణరావును నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మునేడు ఆమోద ముద్ర వేశారు. ఆ సంఖ్య 28 నుంచి 30కు చేరుకుంది. ఈ ఇద్దరు శుక్రవారం అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే అవకాశంముంది.
ఇది ఇలా ఉంటే రాష్ట్ర హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 28 మంది పనిచేస్తున్నారు. ఇద్దరి నియమకంతో ఆ సంఖ్య 30కు చేరుకోగా మరో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. . ఇక ఇద్దరు న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా , ఆతరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. న్యాయాధికారుల కోటా నుంచి వీరి పేర్లను సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని కొలీజియం సిఫారస్ చేస్తూ ఈనెల 11న తీర్మానం చేసింది. దీనికి నేడు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.