Friday, September 13, 2024

AP లో 20 మంది మృతి… నష్టాల వివరాలను ప్రకటించిన ప్రభుత్వం ..

వరద నష్టాలను ప్రకటించిన ప్రభుత్వం
1,69,370 ఎకరాల్లో పంట నష్టం
18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలు లాస్
2.34లక్షల మంది రైతులకు కష్టాలు
60వేల కోళ్లు, 222 పశువులు మరణం
3,312 కి.మీ మేర దెబ్బతిన్న రోడ్లు
ఆరు లక్షల మందికి పైగా నిరాశ్రయులు..

అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 20 మంది మృతిచెందారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలో 12 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మరణించినట్లు వెల్లడించింది. .ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -

నష్ట వివరాలు ఇవే…

”రాష్ట్రవ్యాప్తంగా 1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. 2.34లక్షల మంది రైతులు నష్టపోయారు. 60వేల కోళ్లు, 222 పశువులు మృతిచెందాయి. వరదల వల్ల 22 సబ్‌స్టేషన్‌లు, 3,312 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. వర్షం,

వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,44,536 మంది నష్టపోయారు. 193 రిలీఫ్‌ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఆరు హెలికాఫ్టర్లు పనిచేస్తున్నాయి. 228 బోట్లను రెస్క్యూ ఆపరేషన్‌కు వినియోగిస్తున్నాం. 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపాం” అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement