కర్నూలు బ్యూరో – కృష్ణ ,తుంగభద్ర నదులు పొంగి ప్రవహించడంతో శ్రీశైల జలాశయం కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో జలాశయం నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు జలాశయం చెందిన ఓ గేటును పైకి ఎత్తి దిగువ సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ఉదయం అందిన సమాచారం మేరకు శ్రీశైల జలాశయంలో 885 అడుగుల కాను 884.50 నీటి నిల్వలు ఉన్నాయి. 215 టీఎంసీలకు గాను 212.9198 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇంకా జలాశయముకు నుంచి 93,270 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది. ఇందులో జూరాల నుంచి 68 వేల క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 25,866 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది.
ఇక జలాశయం నుంచి 79,536 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. ఇందులో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 67,626 క్యూసెక్కులు నీటిని వినియోగిస్తూ దిగువ విడుదల చేస్తున్నారు. వీటిలో కుడి విద్యుత్ కేంద్రం నుంచి 30,726 క్యూసెక్కుల నీటిని వినియోగించి 15.284 మెగా యూనిట్లు, ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 36,900 క్యూసెక్కుల నీటి వినియోగం ద్వారా 16.616 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వీటితోపాటు ఏపీ పరిధిలోని మల్యాల నుంచి 1,519 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 5833 క్యూసెక్కులు, తెలంగాణ కల్వకుర్తి నుంచి 1333 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది.
తుంగభద్ర కు భారీగా వరద
కర్ణాటక ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాల మూలంగా తుంగభద్ర జలాశయం భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం నీటిమట్టం 1633 అడుగులకు గాను, 1631.93 అడుగులుగా ఉంది. జలాశయం నీటి నిలువ స్థాయి
105.788 టీఎంసీలకు గాను 101.500 టీఎంసీల నీరు నిలువ ఉంది. ఇక ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 50593 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నాయి. దీంతో వచ్చిన నీరు వచ్చినట్లుగా సుమారు 50000 క్యూసెక్కుల నీరు తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు.
వీటితోపాటు హెచ్ ఎల్ సి కాల్వకు 1853 క్యూసెక్కులు, ఎల్ఎల్సి ఏపీ బార్డర్ 10 31 క్యూసెక్కులు, ఎల్ఎల్సీ టీపీ బార్డర్ కు
676 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం ఎగువన తుంగ జలాశయం నుంచి 6315 క్యూసెక్కులు, భద్రా నుంచి 2348 క్యూసెక్కుల నీరు డ్యామ్ కు చేరుతుంది.