అమరావతి: ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 32 మందిని బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లకు ఏపీ సీఆర్డీఏలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రోటోకాల్ డైరెక్టర్ గా టి.మోహన్ రావును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.రచనను నియమించారు. శ్రీకాళహస్తి దేవాలయం ఈవోగా టి.బాపిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ శిల్పారామం సొసైటీ సీఈఓగా వి.స్వామినాయుడును నియమించారు. సీసీఎల్ఏ సహాయ కార్యదర్శిగా డి.లక్ష్మా రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
- Advertisement -