ఎండ తీవ్రత పెరుగుతోంది. కాగా నేడు ఏపీలోని 73 మండలాల్లో, సోమవారం 12 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గుంటూరులో అత్యధికంగా 15, తూర్పుగోదావరి జిల్లాలో 11, ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇతర ప్రాంతాల్లోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది. అయితే, ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, వైయస్ఆర్, తదితర జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement