Wednesday, November 20, 2024

AP – నేడు చంద్ర బాబు మంత్రివర్గ సమావేశం

అమరావతి – ఎపీ మంత్రివర్గ భేటీ ఈ రోజు జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయం లో జరుగుతున్న ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి న టెండర్ల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు..

జనవరి నుంచి జన్మభూమి.. కొత్త రేషన్ కార్డులు పెన్షన్లతో పాటుగా మహిళకు ఉచిత బస్సు అమలు కు ఆమోద ముద్ర వేయనుంది. రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.కీలక నిర్ణయాలుఏపీ మంత్రివర్గ సమావేశంలో అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో పెట్టుబడులు ప్రధాన అంశాలు గా చర్చకు రానున్నాయి.

అమరావతి నిర్మాణంలో భాగంగా గతంలో కేటాయించిన టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనుంది. సాంకేతిక కారణాలతో రద్దు చేస్తూ.. తాజా ప్రణాళికలకు అనుగుణం గా కొత్త టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నిర్మాణాల ఖర్చు.. టెండర్ల విధానంలో అనుసరించాల్సిన మార్గదర్శకాల పైన కేబినెట్ లో చర్చించి ఫైనల్ చేయనున్నారు.

- Advertisement -

జనవరి నుంచి అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో అమరావతికి సంబంధించి చర్చకు వచ్చిన అంశాలను సీఎం చంద్రబాబు సహచర మంత్రులకు వివరించనున్నారు.

.ఉచిత బస్సు తాజాగా రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్‌ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి తాజా బడ్జెట్ లో ప్రభుత్వం చేసిన కేటాయింపుల పైన వైసీపీ విమర్శలు చేస్తోంది. హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తోంది.

దీంతో, వచ్చే జనవరి నుంచి జన్మభూమి – 2 ప్రారంభంచాలని డిసైడ్ అయింది. ఆ సమయంలోనే కొత్త రేషన్ కార్డులు.. కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. అదే విధంగా సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పథకం అమలు గురించి ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

.వాలంటీర్ల పై నిర్ణయం

దీంతో, పాటుగా అయిదు నెలల కాలంగా చర్చనీయాంశంగా మారిన వాలంటీర్ల అశం పైన నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. సచివాలయాలను పంచాయితీలకు అనుసంధానం చేయటంతో పాటుగా అవసరం మేరకు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి అని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ అంశం పైన చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇక, విశాఖ రుషికొండ భవనాల వినియోగం పైన నేటి మంత్రివర్గంలో చర్చకు రానుంది. భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశం పైన చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అదే విధంగా.. విద్యుత్ ఛార్జీలు అంశం పైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు ఉండటంతో..సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement