అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుందుర్పి మండలoలోని రుద్రంపల్లి గ్రామంలో పాత మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది..
మృతులను గంగన్న, శ్రీదేవి, సంధ్యలుగా గుర్తించారు.. వీళ్లు ఒకే కుటుంబానికి చెందిన వారు అని స్థానికులు చెబుతున్నారు.భారీ వర్షాల కారణంగా ఈ పాత మిద్దె కూలిందని సమాచారం అందుతోంది.
ఈ ఘటనతో కుందుర్పి మండలoలోని రుద్రంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేస్తున్నారు. అటు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు.
- Advertisement -