Tuesday, November 19, 2024

AP | మూడు కొత్త పొగాకు వంగడాలు విడుదల..

కాకినాడ, ఆంధ్రప్రభ ప్రతినిధి : రాజమండ్రిలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ దక్షిణ, ఉత్తర ప్రాంత తేలిక నేలలు, బర్లీ ప్రాంతాలకనువైన మూడు అధిక దిగుబడులనిచ్చే పొగాకు వంగడాల్ని ఇవ్వాల (గురువారం) విడుదల చేసింది. వీటి వివరాల్ని సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ మాగంటి శేషుమాధవ్‌ మీడియాకు వెల్లడించారు. ఎఫ్‌సిఆర్‌ 15(సిటిఆర్‌ఐ శ్రేష్ట) రకం వంగడం దక్షిణ తేలిక నేలలకు అనువైంది. ఇది హెక్టార్‌కు 3వేల కిలోలకు పైగా దిగుబడినిస్తుంది. అలాగే సీతాఫల్‌ తెగుల్లను తట్టుకునే విధంగా దీన్ని రూపొందించారు. ఎఫ్‌సిజె 11(సిటిఆర్‌ఐ నవీన) రకం వంగడం ఉత్తర తేలిక రకం నేలలకు అనువైంది.

ఇది హెక్టార్‌కు 3,300కిలోల దిగుబడిస్తుంది. అలాగే తక్కువ నత్రజనితో కూడా దీన్ని సాగుచేయెచ్చు. పై రెండూ కూడా బ్యారన్‌ రకం పొగాకు వంగడాలు. కాగా వైబి 22(సిటిఆర్‌ఐ విజేత) రకం వంగడం హెక్టార్‌కు 2,900కిలోల దిగుబడిస్తుంది. ఇది కూడా సీతాఫల్‌ తెగులును తట్టుకుంటుంది. ఇది బర్లీరకం పొగాకు వంగడం. ఈ మూడూ కూడా ప్రస్తుత సీజన్‌లో రాజమండ్రిలో సిటిఆర్‌ఐలో అందుబాటులో ఉన్నాయి. వీటిని సాగు చేయడం ద్వారా రైతులు అధిక ప్రయోజనాలు పొందొచ్చని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement