- సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి నూతన కార్యాచరణ..
- స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఏపీలో ఇక నుండీ ప్రతి మూడవ శనివారం స్వచంద్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు స్వచంద్రా కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరరామ్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛత విషయంలో ఏపీ ముందుండాలనే దృఢ నిశ్చయంతో ప్రణాళిక బద్ధంగా చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి నూతన కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ప్రస్తుతం ఏ గ్రామంలో చూసిన చెత్తతో స్వాగతం పలికే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గత ప్రభుత్వంలో చెత్తతో సంపద సృష్టి కేవలం కాగితాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటుకి సంబంధించి రురల్ ఏరియాలో ఒక నూతన ప్రక్రియకి కార్యాచరణ .పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి జిల్లాలో ఒక మండలం ఎంపిక చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రస్థాయి స్వచ్ఛాoధ్ర పై అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వచ్ఛాoధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఏదైనా గ్రామంలోకి ప్రవేశించగానే ఆ ఊరి పేరుకి బదులు అక్కడున్న చెత్త మనకు స్వాగతం పలుకుతుందని ఇక నుంచి ఆ పద్దతికి ముగింపు చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం స్వచ్ఛాoధ్రకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనే దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు.
విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల సందర్బంగా ఆయన మాట్లాడిన మాటలు కానీ దాని ఆశయ సాధన కోసం విడుదల చేసిన 10 ముఖ్యమైన సూత్రాలలో స్వచ్ఛాoధ్రకి కూడా స్తానం కల్పించారన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి అన్నారు. అంతేకాకుండా ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాoధ్ర దినోత్సవంగా ప్రకటించి ఆ రోజున ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ద్రుష్టి పెట్టె విదంగా ఒక దిశా నిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో శానిటేషన్ కానీ అలాగే సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని పూర్తిగా గాలికి వదిలేసారని, వాటన్నిటిని సరిదిద్దుతూ మంచి ఫలితాలు వచ్చే విధంగా యంత్రాంగం పనిచేయాలన్నారు. దేశం లోనే మొట్టమొదటి సారిగా గతంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు క్లీన్ అండ్ గ్రీన్ ఇన్షియేటివ్ ని ప్రారంభించి పచ్చదనం పరిశుభ్రత యొక్క ఆవశ్యకతని ఉమ్మడి రాష్ట్రాల ప్రజలకి తెలియ చెప్పారని తెలిపారు.
ఆ తరువాతి కాలంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడీ కూడా స్వచ్ఛ్ భారత్ అభియాన్ ని ప్రారంభించి ఓడిఎఫ్ విలేజెస్ మనకి ఎంత అవసరమో వాటి మీద దృష్టిపెట్టడం ,మొదటి దశలో ఓడిఎఫ్ ఫ్రీ విలేజెస్ సాధన కోసం మనం పని చేయడం ,రెండవ దశలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ,లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ద్రుష్టి పెట్టి ఓడిఎఫ్, మోడల్ విలేజెస్ సాధన కోసం ప్రణాళిక బద్ధంగా పనిచేయాలన్నారు.
ప్రస్తుతం ఏ విభాగంలో చూసినా స్వచ్ఛత విషయంలో మన రాష్ట్రం అట్టడుగునే నిలిచిందని దానిని మెరుగుపరుచుకుని దేశం లోనే స్వచ్ఛత విషయం లో మన రాష్ట్రం అగ్రగామిగా నిలవాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఉండి స్మశాన వాటికలో చెత్త డంప్ చేయడం వలన అంత్యక్రియలు నడిరోడ్డు మీద చేశారనే వార్త నన్ను కలచివేసిందని ఇంతకంటే దౌర్భాగ్యమైన విషయం ఇంకోటి ఉంటుందా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నా వాటిని సరిదిద్దాలని ఆదేశించారు.