Saturday, November 23, 2024

AP | దోచుకుతింటున్నారు.. నారా లోకేష్ కు విన్నవించుకున్న కార్మికులు

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో: దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషించే రవాణా రంగాన్ని వైసిపి ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టివేస్తోందని రవాణా రంగ ప్రతినిధులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు, ప్రజలకు అవసరమయ్యేవి అన్నింటిని అందించడంలో ముందున్న తమపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తూ పన్నుల రూపంలో దోచుకు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలే పెట్రోల్ డీజిల్ పెరిగి అయోమయ పరిస్థితిలో ఉంటే, ఆటోనగర్ తరలిస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. యువగలం పేరుతో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం విజయవాడలో ఆటోనగర్ ప్రతినిధులు కార్మికులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆటో రంగా ప్రతినిధులు కార్మికులు మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న ఆటో నగర్ ఇప్పుడు జగన్ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ట్రాన్స్ పోర్ట్ రంగం జగన్ పాలన లో కుదేలు అయ్యేలా చేసిందన్నారు. గ్రీన్ ట్యాక్స్ పేరుతో వేధిస్తున్నారని, రూ.200 ఉన్న గ్రీన్ ట్యాక్స్ ని రూ.26,816 చేశారాన్నరు. ఓవర్ లోడ్, ఓవర్ హైట్ పేరుతో జగన్ ప్రభుత్వం మమ్మల్ని దోచుకుంటుందన్నరు. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ పేరుతో ఏడాదికి రూ.60 అదనపు భారం పడుతుందన్నారు. రోడ్లు కూడా దారుణంగా ఉండటం వలన ట్రాన్స్ పోర్ట్ యాజమానుల పై విపరీతమైన భారం పడుతుందన్నరు.

ఆటో నగర్ లో పనిచేస్తున్న కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. టైర్లు కొనాలి అన్నా, పాత టైర్ అమ్మాలి అన్నా జీఎస్టీ పేరుతో వేధిస్తున్నారన్నారు. 57 ఏళ్లుగా ఆటో నగర్ లో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నా ఆటోనగర్లో కనీస మౌలికలు సదుపాయాలు కూడా లేవన్నారు. ఆటో నగర్ లో యాజమాన్య హక్కులు లేక ఇబ్బంది ఇబ్బంది పడుతుంటే, జగన్ ఆటో నగర్ ని తరలిస్తామని బెదిరిస్తున్నాడన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement